ఆదివాసీల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఆందోళన

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

భద్రాచలం టౌన్‌: హక్కుల సాధన కోసం ఆదివాసీలు సోమవారం ఆందోళన చేపట్టారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ మార్చ్‌ పేరిట బ్రిడ్జి సెంటర్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హక్కుల సాధనలో ఆదివాసీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఐటీడీఏ ద్వారానే ఏజెన్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఐటీడీఏలలో సింగిల్‌ లైన్‌ పరిపాలన అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుమారు 4 గంటలపాటు ఆందోళన కొనసాగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక్‌ విజయ్‌ కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌ కుమార్‌, నాయకులు ఈసం సుధాకర్‌, పుర్క బాపురావు, జంగులు, రమేష్‌, వెంకటనారాయణ, సతీష్‌, వసంతరావు, తంబాల రవి పాల్గొన్నారు.

ఐటీడీఏ ఎదుట నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement