గోదావరి జలాలు | - | Sakshi
Sakshi News home page

గోదావరి జలాలు

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

ట్రంక్‌ కెనాల్‌ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు

అక్టోబర్‌లోగా ‘సత్తుపల్లి’కి

ములకలపల్లి: అక్టోబర్‌ నెలాఖరులోగా సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌కు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే జారె ఆదినారా యణ, కలెక్టర్‌ అంకిత్‌తో కలిసి ఆయన పర్యటించారు. తొలుత కుమ్మరిపాడు వాగుపై రూ.4.60 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జిని ప్రా రంభించారు. అనంతరం కమలాపురం శివారులోని పంప్‌హౌస్‌–3లో 30 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్‌ స్విచ్‌అన్‌ చేసి, ట్రయల్‌రన్‌ నిర్వహించారు. డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్ద అన్నదైవం చెరువుకు పరుగులెత్తుతున్న నీటి ఉధృతిని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమలాపురం పంప్‌ హౌస్‌ నుంచి గండుగులపల్లి పంప్‌హౌస్‌–4కు 40 కి.మీ. పొడవునా ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 33 కి.మీ పనులు పూర్తయినట్లు తెలి పారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహించి చీరె, సారె సమర్పించారు. ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జహీర్‌, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వరరావు, పర్వతనేని అమర్‌నాథ్‌, పువ్వాల మంగపతి, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారా వు, ఈర్ల కిరణ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మట్టిలో దిగబడిన మంత్రి వాహనం

డిశ్చార్జ్‌ పాయింట్‌ పరిశీలనకు వెళ్తున్న క్రమంలో దారి బాగా లేకపోవడంతో ఆయన దిగి నడిచి వెళ్తుండగా.. క్యాంపర్‌ వాహనం రావడంతో తుమ్మల దానిలో డీసీకి చేరుకున్నారు. అనంతరం అదే వాహనంలో తిరిగి వస్తుండగా తుమ్మలను అనుసరిస్తున్న కారు పూర్తిగా మట్టిలో దిగబడింది. దీంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణతోపాటు, స్థానిక నాయకులు, ఇరిగేషన్‌ సిబ్బంది అతికష్టం మీద కారును బయటకు తీశారు. ఆతర్వాత అక్కడి నుంచి మరో కారులో తుమ్మల పంప్‌హౌస్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.

పామాయిల్‌ ఫ్యాక్టరీ సందర్శన..

దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సందర్శించా రు. గెలలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్యాక్టరీ ఉప ఉత్పత్తుల రవాణాలో స్థానిక లారీ యజమానులు ఇబ్బంది పెడుతున్నారని మేనేజర్‌ నాగబాబు విన్నవించగా, స్పందించిన మంత్రి రవాణా శాఖ అధికారితో మాట్లాడిసమస్య సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement