పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఐస్టా–2026 సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌ను శుక్రవారం ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, మేయర్ మూడ్ గణేష్, ఎస్‌జీఈఎఫ్ చైర్మన్ ఎన్.సురేష్‌రెడ్డి బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ85 ఏళ్లు దాటిన క్రీడాకారులు కూడా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి, డిప్యూటీ మేయర్ లలితకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా, యుగంధర్ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.


