అశ్వారావుపేటరూరల్: క్షయ రహిత గ్రామాలే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని, ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం టీబీ పరీక్షలు చేస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని వేదాంతపురంలో పిరమల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన టీబీ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబా ద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తొలి విడతలో భాగంగా టీబీ ముక్త్ జన జాతీయ అభియాన్ కింద ఎంపికయ్యాయని తెలిపారు. జిల్లాలోని 371 గ్రా మాలను తొలి విడత కింద ఎంపిక చేయగా, అందులో వేదాంతపురం కూడా ఉందన్నారు. ఐదు రోజులపాటు ఇంటింటి సర్వే ద్వారా గ్రామస్తులకు టీబీ పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. తొలి రోజు గ్రామంలో 50 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా, ఏడుగురిలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో మందులు పంపిణీ చేశారు. అనంతరం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అటెండర్స్ కాలనీలోని ఐటీడీఏ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ను సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు వస్తు న్న ఆరోపణలపై ఆరా తీసి, మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే సహించేదిలేదన్నారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ బానోతు ప్రసాద్, డీపీఓ నళిని, గుమ్మడవల్లి పీహెచ్‌సీ వైద్యురాలు నందిత, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్


