జిల్లాకు ఐదు పాఠశాలల మంజూరు, మూడింటికి నిధులు..
అధునాతన సౌకర్యాలతో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వ కృషి
నియోజవర్గానికి ఒకటి చొప్పున..
నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్‌లో హైస్కూల్, ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం బోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పినపాక నియోజకవర్గంలోని జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చనున్నారు. వీటిలో జానంపేట పబ్లిక్ స్కూల్‌కు రూ.9.9 కోట్లు, బోడు పబ్లిక్‌స్కూల్‌కు రూ.10 కోట్లు, అశ్వారావుపేట పబ్లిక్ స్కూల్‌కు రూ.6 కోట్లు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 119 పాఠశాలలు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 119 ఇంటిగ్రేటేడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను మంజూరు చేయగా, వాటిలో 75 పాఠశాలలను మొదటి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో జిల్లాలోని 3 స్కూల్స్‌లో ఉండగా, ఇప్పటికే నిధులు విడుదల చేసింది. టెండర్లు పిలిచి పక్కా భవన నిర్మాణంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
జిల్లాకు ఐదు ఇంటిగ్రేటెడ్ తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో బోడు, అశ్వారావుపేట, జానంపేట పాఠశాలలకు రూ.25.9 కోట్లు మంజూరయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరంలోగా పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తాం.
– వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి
క్రీడా, సాంస్కృతిక పాఠాలు కూడా..
తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఒకే క్యాంపస్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. విశాలమైన స్థలం ఉన్న పాఠశాలను విద్యాశాఖ అధికారులు గుర్తించి అప్‌గ్రేడ్ చేశారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో అధునాతన వసతులు కల్పించనున్నారు. క్రీడామైదానం, కంప్యూటర్‌ల్యాబ్, సైన్స్‌ల్యాబ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. ఆయా పాఠశాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, సిబ్బందినే వినియోగించుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. క్రీడా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస తదితర రంగాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యనందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఒకే క్యాంపస్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలనే ఎంపికచేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (ఇంటి గ్రేటెడ్)గా మార్చాలని నిర్ణయించింది. జిల్లాలో ఐదు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయనుండగా, ఇటీవల మూడు పబ్లిక్ స్కూళ్లకు రూ.25.9 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 2027–2028 విద్యాసంవత్సరంలోగా మౌలిక వసతులతో పక్కాభవనాలు నిర్మించనుంది.
– పాల్వంచరూరల్
ఒకే క్యాంపస్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు


