సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి, భుక్తి కోసం ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచారని కలెక్టర్ అంకిత్ కొనియాడారు. కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐలమ్మ పోరాటం, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఇరత అధికారులు పద్మావతి, అనంత రామకృష్ణ, విజయలక్ష్మి, శ్రీలత, బీసీ సంఘాల నాయకులు నేరెళ్ల రమేష్, అజిత్ కుమార్, రేచర్ల సర్వేశ్వర రావు, కణతాల వసంత రావు, పోగుల లక్ష్మీనారాయణ, చిటికెన ముసలయ్య, ముదిగొండ రాంబాబు, కొదుమూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చర్యలు
వేగవంతం చేయాలి
చుంచుపల్లి: కేంద్రీయ పాఠశాల ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాఠశాలకు కేటాయించిన లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం స్థలాన్ని గురువారం ఆయన సందర్శించారు. విద్యాలయ ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఉన్న స్థలాన్ని త్వరతిగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో కేటాయించిన స్థలంలోకి మార్చాలని సూచించారు. తహసీల్దార్ శిరీష, విజయ డెయిరీ మేనేజర్ సౌజన్య పాల్గొన్నారు.
రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం
చండ్రుగొండ: రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో చేపట్టిన రీ సర్వేను గురువారం పరిశీలించారు. పురోగతిపై ఆరా తీశారు. పాత భూరికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


