కేటీపీఎస్‌లో శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌లో శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్‌ 5, 6వ దశల కర్మాగారాన్ని గురువారం శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తురై రాజా సందర్శించారు. పాల్వంచలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన కేటీపీఎస్‌ కర్మాగారాలను సందర్శించగా చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.ప్రభాకర్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోల్‌ ప్లాంట్‌, బాయిలర్‌, టర్బయిన్‌, యూసీబీ, కూలింగ్‌ టవర్‌ తదితర కీలక విభాగాలను ఆసక్తిగా పరిశీలించి కర్మాగార నిర్వహణ తీరును ప్రశంసించారు. అధికారులు మధుబాబు, సమీర్‌, బి.రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వైటీఎంకే.రాజు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలను

నివారించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ ఆదేశించారు. గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 42 బ్లాక్‌ స్పాట్ల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు వెంకటరమణ, అనూష, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, గడ్డం ప్రవీణ్‌ కుమార్‌, బాలాజీ పాల్గొన్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement