అమరుల చరితను దాచలేరు | - | Sakshi
Sakshi News home page

అమరుల చరితను దాచలేరు

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

భద్రాచలంఅర్బన్‌: ఆదివాసీలు, బడుగు, బలహీనవర్గాల కోసం జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల చరిత్రను దాచిపెట్టడం సాధ్యం కాదని పలువురు వక్తలు అన్నారు. టీవీఆర్‌ చంద్రం వర్థంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఆధారంగా కుమారుడు టి.జగన్‌ మోహన్‌ రచించిన ఎగరేసిన ఎర్రజెండా పుస్తకాన్ని గురువారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్‌ హాల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కడవరకు నిలిచిన వారే నిజమైన కమ్యూనిస్టులని అన్నారు. సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు సింగు నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్‌ పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, నాయకులు రవికుమార్‌, ఏజే రమేష్‌, చిటూరు వెంకట్రావు, పోటు రంగారావు, ముర్ల రమేష్‌, ఎంబీ నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి, పుల్లయ్య పాల్గొన్నారు.

‘ఎగరేసిన ఎరజ్రెండా’ పుస్తకావిష్కరణ

సభలో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement