నేడు ‘సాక్షి’ ఆధ్వర్యాన ‘ఫోన్ ఇన్’
చుంచుపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ప్రస్తుతం అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కొనసాగుతోంది. అయితే, జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బీఎల్‌ఓలను సంప్రదిస్తున్నారు. అంతేకాక నోటీసులు అందుకున్న వారు ఏమేం పత్రాలు సమర్పించాలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలకు ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించే ఫోన్ ఇన్‌లో కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి రంగాప్రసాద్ స్వయంగా సమాధానాలు ఇవ్వనున్నారు. ఓటర్లు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
తేదీ : 11–09–2026, శుక్రవారం (నేడు)
సమయం : ఉదయం 11 నుంచి
12 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్
93929 19709


