సారపాకలో భారీ సూచిక బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

సారపాకలో భారీ సూచిక బోర్డు ఏర్పాటు

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

బూర్గంపాడు: సారపాక మీదుగా భద్రాచలం పట్టణానికి వెళ్లే వాహనదారులకు దిశానిర్దేశం చేసేలా ప్రధాన రహదారిపై ఎన్‌ఎచ్‌ఏఐ ఆధ్వర్యంలో భారీ సూచిక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. చర్ల, వెంకటాపురం, వాజేడు, కూనవరం, కుంట, చింతూరు, రాజమండ్రి, జగదల్‌పూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాలు, దూరాలను బోర్డుపై పొందుపరిచారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఈ సూచిక బోర్డు ఉపయోగకరంగా మారనుంది.

వరకట్న వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలు

భద్రాచలంఅర్బన్‌: వరకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ భద్రాచలం జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వి.శివనాయక్‌ గురువారం తీర్పు వెల్లడించారు. భద్రాచలానికి చెందిన కాలంగి వర్ష తన భర్త దీపక్‌, అతని కుటుంబసభ్యులపై వరకట్న వేధింపులకు సంబంధించి 2021లో భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీంతో సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో దీపక్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున శ్రీధర్‌ వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా నరసింహారావు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement