ప్రభుత్వం అండగా ఉంటుంది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం అండగా ఉంటుంది

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

ములకలపల్లి: హైదరాబాద్‌లో హత్యకు గురైన మండలంలోని నర్సు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. గురువారం నిర్వహించిన యువతి సంస్మరణ సభలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటితోపాటు, ప్రభుత్వ సాయంగా రూ 7.30 లక్షలు అందించినట్లు తెలిపారు. అనంతరం యువతి సోదరుడికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. నర్సు పేరిట గ్రామంలో హెల్త్‌ సబ్‌సెంటర్‌, కంపగూడెం క్రాస్‌రోడ్డు వద్ద బస్‌షెల్టర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఈ నెల 6వ తేదీన చేపట్టిన పాదయాత్ర గురువారం సంస్మరణ కార్యక్రమం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ మాట్లాడుతూ రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, తాటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆదినారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement