జూలూరుపాడు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. బుధవారం ఆయన జూలూరుపాడు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వైద్య సేవలపై ఆరా తీశారు. కొత్తగూడెంలో ఎయిడ్స్ నిర్మూలనకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వర బాధితులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. జీవితం విలువైనదని, సమస్యలు, ఒత్తిడికి ఆత్మహత్యలు పరిష్కారం కావని అన్నారు. పోలూరి రాము నేతృత్వంలోని జానపద బృందం ఆధ్వర్యంలో కళా జాతా సాంస్కృతిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారులు ప్రసాద్, బి.వెంకటేశ్వర్లు, ఇందిర, జాన్‌బీ, జి.శశికళ, నాగయ్య, మహమూద్ అలీ, వీరయ్య పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్


