15మంది కూలీలకు గాయాలు
పాల్వంచరూరల్: రటాక్టర్ బోల్తా పడి 15 మంది కూలీలు గాయపడ్డ ఘటన మందేరకలపాడు సమీపంలో బుధవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు పత్తి చేలో కలుపు తీసేందుకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒంటిగుడిసె వద్ద టైరు మొట్టుపైకి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో కూలీలకు గాయాలు కాగా, పాల్వంచ, కొత్తగూడెం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాల్వంచ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, సీపీఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, నిమ్మల రాంబాబు, సర్పంచ్ బి.లక్ష్మి తదితరులు పరామర్శించారు.


