సత్తుపల్లిటౌన్: మంచం పైకి ఎక్కే క్రమాన కింద పడిన వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. కొత్తగూడెంకు చెందిన ఏలపాటి భారతమ్మ(65) కుటుంబం సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్‌లో నాలుగేళ్లుగా నివనిస్తోంది. ఆమె కుమారుడు శ్రీనివాస్ సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న భారతమ్మ బుధవారం నిద్రించేందుకు మంచం ఎక్కేక్రమాన జారి కిందపడి అస్వస్థతకు గురైంది. దీంతో సత్తుపల్లిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, శ్రీనివాస్ కుమార్తె పుట్టిన రోజు నాడే భారతమ్మ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
జూలూరుపాడు: ఆలయాల్లో వరుసచోరీలకు పాల్ప డుతున్న ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ఎన్.జీనత్ కుమార్ కథనం ప్రకారం.. కొమ్ముగూడెం ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం జూలూ రుపాడు సాయిబాబా ఆలయం వద్ద అనుమానా స్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఖమ్మానికి చెందిన ఎస్కే ఖాజా, జి.లాలయ్య కొమ్ముగూడెం ఆలయంలోని చోరీతోపాటు గతంలో పలు ప్రాంతా ల్లోని ఆలయాల్లో హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారు. రూ.5,798లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ–2 మనీషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


