ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
భద్రాచలంటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇప్పించడంతోపాటు సీపీఎస్‌ను రద్దు చేయించేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. భద్రాచలంలోని పీఆర్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా, మండల నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్, గురుకుల, ఆశ్ర మ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు మినిమం టైమ్‌స్కేల్ ఇప్పిస్తామని అన్నారు. ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయులు ఎస్.శంకర్, యుగంధర్ కుటుంబాలకు పీఆర్టీయూ సంక్షేమ నిధి నుంచి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. సెప్టెంబర్ 1న చేపట్టే మహాధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, జిల్లా నాయకులు నరసయ్య, ప్రభాకర్‌రావు, కట్టా శేఖర్‌రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
స్పోర్ట్స్ మీట్
చుంచుపల్లి: 6వ బెటాలియన్ చాతకొండలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌మీట్ మూడో రోజు శుక్రవా రం ఉత్కంఠ భరితంగా కొనసాగింది. హైజంప్, పరుగు పందెం, వాలీబాల్ తదితర విభా గాల్లో సిబ్బంది సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌లు హెచ్.అబ్దుల్ రషీద్, బి.మరియధాసు, ఎ.వి.రమణయ్య, ఏ.ఓ సత్యవతి సిబ్బంది పాల్గొన్నారు.
ఆదర్శనీయులు
పూలే దంపతులు
భద్రాచలంటౌన్: సామాజిక మార్పు, మహిళా విద్య కోసం పోరాడిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జీవితం నేటి తరానికి ఆదర్శమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. అభ్యుదయ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో శుక్రవారం ‘సత్యశోధన’ నాటికను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే దంపతుల ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. న్యాయమూర్తి శివ నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తేవడానికి నాటికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో అకాడమీ రాష్ట్ర నాయకులు కే.దేవేంద్ర, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు.
తీసుకున్న సొత్తు తిరిగి ఇవ్వని యువకుడు
పీఎస్ ఆవరణలో
మాత్రలు మింగిన మహిళ
పాల్వంచ: పరిచయమైన యువకుడికి నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వగా.. తిరిగి రాకపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ ఓ మహిళ పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో మాత్రలు మింగి ఆత్మహత్యయత్యానికి పాల్పడింది. మహబూబాబాద్‌కు చెందిన ఓ మహిళ సుజాతనగర్ మండలం నిమ్మలగూడెంలోని సోదరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన పరిచయమైన వంశీకి రూ. 25వేల నగదు, 3.7 గ్రాముల నెక్లెస్, చెవిదిద్దులు ఇచ్చింది. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పాల్వంచ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జూలై 18వ తేదీన 25 రోజుల్లోగా తిరిగి ఇస్తానని ఆయన లేఖ రాసి ఇచ్చాడు. అయినా ఇవ్వకపోవడం, యువకుడు, పోలీసుల నుంచి స్పందన లేకపోగా ఆమె ఇంట్లోనూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆమె ఆవరణలో వివిధ రకాల మాత్రలు మింగింది. గుర్తించిన సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. సదరు యువకుడు ఇస్తానని ఒప్పుకున్నా ఆయ న ఆస్తి అమ్ముడవక ఆలస్యం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారమంతా సుజాతనగర్ పరిధిలో ఉందని, మహిళ అమ్మమ్మ ఉండేది పాల్వంచలో సీతారాంపట్నం కావడంతో ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినందున తాము కౌన్సిలింగ్ చేశామని తెలిపారు.


