రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపాన శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌కు చెందిన బచ్చల హరికృష్ణ(20) బయ్యారం మండలం గంధంపల్లి సమీ పాన పూర్ణటైల్స్‌లో పనిచేసేందుకు తన అన్న, బాబాయ్‌తో కలిసి బైక్‌పై వస్తున్నాడు. నామాలపాడు వద్ద వెనుక నుంచి మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హరికృష్ణను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్‌బాబు తెలిపారు.
కొత్తగూడెం బస్టాండ్‌లో గంజాయి కలకలం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి గంజాయి కలకలం రేపింది. బస్టాండ్‌లోని డీసీ రూం పక్కన ఉన్న 15 కిలోల గంజాయిని కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రెండు రోజుల క్రితం బస్టాండ్‌లో తనిఖీ చేసినా ఫలితం దక్కలేదు. మళ్లీ శుక్రవారం రాత్రి పోలీసు జాగిలంతో బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. పక్కా సమాచారంతో వెళ్లిన డీఎస్పీ ఆదినారాయణ గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఆర్టీసీ డీఎం రాజ్యలక్ష్మి ఆదేశాలతో సిబ్బంది 13 ప్యాకెట్లలో ఉన్న గంజాయి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ బ్యాగ్ కొత్తగూడెం బస్టాండ్‌కు ఎప్పుడు, ఎలా చేరింది, సిబ్బంది హస్తం ఉన్నదా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా బ్యాగు దొరకగా, తామే పోలీసులకు అప్పగించామని డీఎం రాజ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తనిఖీ చేసినప్పుడు బ్యాగు ఎందుకివ్వలేదని అడుగగా, ఆ సమయంలో తాను మీటింగ్‌కు వెళ్లానని, పోలీసుల తనిఖీ విషయం తనకు ఎవరూ చెప్పలేదని సమాచాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణను వివరణ కోరగా.. గంజాయి స్వాధీనం చేసుకున్నామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
మణుగూరు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్‌కు చెందిన నల్లపు రవితేజ విజయవాడలోని ఓ కంకర మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 19న ఇంటికి వచ్చి 20న తిరిగి వెళ్లాడు. అప్పటి నుంచి ఆచూకీ లేదు. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.


