ఖమ్మంక్రైం/పాల్వంచరూరల్: : ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇటీవల ఆప్షన్లు స్వీకరించగా, పరిశీలన అనంతరం ఉమ్మడి జిల్లాలోని 200మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు శనివారం కొత్త స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. వీరు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని నూతన స్థానాల్లో రిపోర్ట్ చేశారు.
ప్రతీ స్టేషన్‌లో మహిళా సిబ్బంది
ప్రతీ ఎకై ్సజ్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఒకరైనా ఉండాలని ఇటీవల ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఫలితంగా కొందరు ప్రస్తుత స్థానాల నుంచి దూరప్రాంతాల్లోని స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. కాగా, త్వరలోనే శాఖలోని సీఐలు, ఎస్‌ఐల బదిలీలు సైతం ఉంటాయని తెలుస్తోంది.
పాల్వంచలో 8 మంది..
పాల్వంచలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్న 8 మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణతోపాటు మరో ఏడుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో పది మంది బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
200మంది హెచ్‌సీలు,
కానిస్టేబుళ్లకు స్థానచలనం


