బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..

‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్‌ కటింగ్‌, వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌కేర్‌, హెయిర్‌ కేర్‌, వెడ్డింగ్‌ ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, ఐబ్రోస్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్‌), హెయిర్‌ మసాజ్‌, కమ్యూనికేషన్‌, గ్రూమింగ్‌ ఫేషియల్స్‌, శారీ డ్రాపింగ్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్‌ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్‌షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్‌ – ట్రైనింగ్‌ సెంటర్‌లో సంప్రదించాలి. ఇతర వివరాలకు 96660 13544, 96182 18701 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement