మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సత్కారం
ఇల్లెందు: 17 ఏళ్లుగా తాను టీచర్‌గా పనిచేసిన పాఠశాలలో ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ కిరణ్‌మిత్రను మంగళవారం సన్మానించారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను స్కూల్ చైర్మన్ జోష్ నెడుంతుండం, ప్రెసిడెంట్ టి.సుధాకర్, డైరెక్టర్‌రాజు, హెచ్‌ఎం బిజూకే జోసెఫ్, ప్రిన్సిపాల్ నిషా సత్కరించారు. ఆ పాఠశాల లో కిరణ్‌మిత్ర 17 ఏళ్లు టీచర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా తన క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.
టెండర్లు ఖరారు
భద్రాచలం: సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం టెండర్‌ల ను ఖరారు చేశారు. భద్రాచలం ఆలయం వద్ద పాదరక్షలు, లాకర్ల లైసెన్సు హక్కులను రూ.21 లక్షలకు, పర్ణశాల ఆలయం వద్ద సెల్‌ఫోన్‌లు భద్రపర్చు లైసెన్సులను రూ. 8,30,000కు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు వెల్లడించారు.


