రామయ్యకు స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్నపన తిరుమంజనం

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

రామయ్

రామయ్యకు స్నపన తిరుమంజనం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం వైభవంగా స్నపన తిరుమంజనం జరిపారు. ప్రతీ బుధవారం బేడా మండపంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

రామాలయంలో ‘విజిలెన్స్‌’ విచారణ

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యాలయంలో బుధవారం విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాటు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందడవతో వారు విచారణ చేసినట్లు సమాచారం. ప్రధానంగా గతంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తూ రెగ్యులర్‌ జాబ్‌ పొంది, మళ్లీ తిరిగి ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఒకరి వివరాలు సేకరించినట్లు తెలిసింది. దీంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు, రికార్డులను ఆలయ ఈఓ సమక్షంలో విచారించినట్లు సమాచారం. కాగా ఆలయంలో కేవలం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పైనే విచారణ జరపడం చర్చకు దారి తీసింది.

క్రీడా పాఠశాలల్లో

ప్రవేశాలకు ఎంపికలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం మండలస్థాయిలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలస్థాయి ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు మొదట tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 26 నుంచి మార్చి 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. 2017 సెప్టెంబర్‌ 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, 3వ తరగతి చదువుతున్న పాఠశాల నుంచి వయసు, విద్యార్హత సర్టిఫికెట్లు, పుట్టినతేదీ రిజి స్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆరు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకెళ్లాలని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లాకు, అక్కడ ఎంపికై న వారిని రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు తెలి పారు. వివరాలకు 9505423226, 9966125087 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో జరుగుతున్న వార్షిక నిర్వహణ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన అప్పారావుపేట ఫ్యాక్టరీలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చేయకుండా గడువులోపుగా పూర్తిచేసి, యంత్రాల పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్‌ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు స్నపన తిరుమంజనం1
1/1

రామయ్యకు స్నపన తిరుమంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement