ఇక నూతన భవనాల్లో విద్య!
జూనియర్ కళాశాల, కూలీలైన్
పాఠశాలల్లో కొనసాగుతున్న
గదుల నిర్మాణం
కళాశాలకు రూ.3.92 కోట్లు,
పాఠశాలకు రూ.2 కోట్ల నిధులు
వచ్చే విద్యా సంవత్సరంలో
అందుబాటులోకి..?
పనులు జరుగుతున్నాయి..
కొత్తగూడెంఅర్బన్: స్థానిక కూలీలైన్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొద్ది రోజుల కిందట శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేశారు. సదరు పాఠశాల, కళాశాలకు నిధులు కేటాయించి నూతన గదుల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో వచ్చేవిద్యా సంవత్సరంలో విద్యార్థులు నూతన భవనాల్లో విద్యనభ్యసించనున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల గదులు శిథిలావస్థకు చేరి, వర్షం వస్తే కురవడం, ఎండకు అధిక వేడి ప్రసరిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏళ్లుగా అవస్థలు పడ్డారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి విషయం చేరడంతో వారు స్పందించి పాఠశాల ఆవరణలో నూతనంగా ఎని మిది గదులు నిర్మించేందుకు రూ.2కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబర్‌లో శిథిలావస్థవకు చేరిన గదులను కూల్చి, వాటి స్థానంలో కొత్త గదు లు నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయి తే, ఆ గదుల్లో విద్యనభ్యసించేవారిని సైన్స్ ల్యాబ్ లు, గ్రంథాలయం, డిజిటల్ గదుల్లో సర్దుబాటు చేసి, పాఠాలు బోధిస్తున్నారు. గదులు కూల్చివేశా రు కానీ, పనులు ఆలస్యం అవుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. గదులు కూల్చివేసిన ప్రాంతం విద్యార్థులకు ప్రస్తుతం మైదానంగా ఉపయోగపడుతోంది. పాఠ్యంశాల బోధన, విద్యార్థులు కూర్చునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే విద్యా సంవత్స రం నాటికి గదుల నిర్మాణం జరిగితే ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. కూలీలైన్ ప్రభు త్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి పాఠశాలలో గదుల నిర్మాణ పనులు త్వరితగతిన జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు.
జూనియర్ కళాశాలలో..
కొత్తగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అదే పరిస్థితి ఉండడంతో శిథిలావస్థలో ఉన్న గదులను ఇటీవల తొలగించారు. గదుల్లో రేకులు పగిలిపోయి, వర్షం వచ్చినప్పడల్లా విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడేవారు. గదుల గోడలు వర్షపు నీటితో తడిచి, చెమ్మ వచ్చి ఎప్పడు కూలు తాయోనని అందరూ ఆందోళన చెందే వారు. అయి తే, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి విషయం చేరడంతో ఆయన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కళా శాల పరిస్థితులను వివరించారు. దీంతో కళాశాల లో 14 నూతన గదులు నిర్మించేందుకు గానూ రూ. 3.92 కోట్లను మంజూరు చేయగా.. నిర్మాణ పనులు కళాశాలలో కొనసాగుతున్నాయి. నూతన గదుల నిర్మాణం కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తయితే విద్యార్థులకు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉంటుంది. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటుగా జిల్లాలో మరో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలున్నాయి. వాటంన్నీటిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కళాశాల భవన గదులు శిథిలావస్థకు చేరి ఉండడంతో ఎండ, వానలకు విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. కొన్నింటిలో టాయిలెట్లు సరిగా లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోగశాల గదులు, మైదానం ఇలా అన్నీ అసౌకర్యంగా ఉండడం వల్ల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది. మిగతా కళాశాలల్లో కూడా నూతన గదులు నిర్మించడానికి, మరమ్మతులు చేయించడానికి నిధులు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పాతబడిన గదులను తొలిగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. అవి అందుబాటులోనికి వస్తే విద్యార్థులు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉంటుంది. పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. –హెచ్.వెంకటేశ్వర్లు,
ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
ఇక నూతన భవనాల్లో విద్య!
ఇక నూతన భవనాల్లో విద్య!


