రాష్ట్రస్థాయి పోటీల్లో దివ్యాంగ విద్యార్థి సత్తా
దమ్మపేట: ఈ నెల 17న హైదరాబాద్‌లో దివ్యాంగులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థి తురసం హర్షవర్దన్ 50 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి, ప్రథమ స్థానంలో నిలిచాడు. హర్షవర్దన్ మండలంలోని చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో హర్షవర్దన్‌ను ఎంఈఓ కీసర లక్ష్మి, సర్పంచ్ పగడాల రమాదేవి అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో పగడాల రాంబాబు, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఊషారాణి, మస్తాన్, నాగలక్ష్మి, కనకదుర్గ, తిరుమల కుమారి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో
సమస్యలు పరిష్కరించాలి
ఇల్లెందు: రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమపాఠశాలల్లో నెలకొన్నసమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు గుగులోతు హరిలాల్, భాగ్య రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఇల్లెందు లోని సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని హా స్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా మార్చాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఈ నెల 26న ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, వచ్చే నెల 10న కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో పాయం సర్వేశ్వరరావు, కాయం లక్ష్మీనారాయ ణ, బానోతు రాజారత్నం, భూక్యా రాములు పాల్గొన్నారు.
రేపు సేవాలాల్
జయంతి వేడుకలు
భద్రాచలం: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను భద్రాచలంలో గురువారం నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన భవనంలో జరిగే ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అలాగే ఈనెల 28న ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. వారం రోజుల పాటు వేడుకల నిర్వహణకు సంత్ సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని కోరారు.
రూ.67లక్షల విలువైన
గంజాయి స్వాధీనం
వైరా: వైరా మీదుగా కారులో తరలిస్తున్న గంజా యి, హషీష్ ఆయిల్‌ను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆధ్వర్యాన ఎస్‌ఐ సీహెచ్.శ్రీహరిరావు, ఉద్యోగులు వైరా ఐఎంఎల్ డిపో ఎదురుగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో పరిశీలించగా 101.2 కేజీల ఎండు గంజాయి, 2.7 కేజీల హషీష్ ఆయిల్ లభ్యమైంది. దీని విలువ రూ.67.20 లక్షలు ఉంటుందని ఏసీ గణేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన మహ్మద్ అస్లామ్ ఒడిశా రాష్ట్రం కలిమెలలో కొనుగోలు చేసిన గంజాయి, ఆయిల్‌ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు ఇస్లామ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా, గంజాయి, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252523కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఏదులాపురంలో 24కిలోలు...
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ మీదుగా ఆటోలో తరలిస్తున్న 24కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం గురవాయిగూడెంకు చెందిన పుట్టమంతి ఉదయ్, ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడుకు చెందిన ఎరుపుల అఖిల్ ఒడిశా రాష్ట్రానికి చెందిన నూకరాజువద్ద గంజాయికొనుగోలుచేసి ఆటోలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈమేరకు తనిఖీల్లో పట్టుబడగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో దివ్యాంగ విద్యార్థి సత్తా
రాష్ట్రస్థాయి పోటీల్లో దివ్యాంగ విద్యార్థి సత్తా


