గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ సిగ్నల్‌

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

గ్రీన్‌ సిగ్నల్‌

గ్రీన్‌ సిగ్నల్‌

భద్రగిరిలో గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియం ఏర్పాటుకు ఓకే

ఐదెకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం

సాకారం కానున్న ఏజెన్సీ క్రీడాకారుల కల

భద్రాచలం: ఎన్నో ఏళ్లుగా భద్రాచలం క్రీడాకారులు, స్థానికులను ఊరిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియం కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఐదెకరాల స్థలం కేటాయిస్తూ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే హామీకే పరిమితం కాకుండా భూ సేకరణ, నిధుల విడుదల ప్రక్రియ పూర్తిచేసి స్టేడియం నిర్మాణం వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.

అన్నింటికీ ఆ గ్రౌండే దిక్కు..

భద్రాచలంలో ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ మాత్రమే ఉంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైవేట్‌, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు.. ఇలా అన్నింటికీ ఈ మైదానమే దిక్కు కాగా, కాలేజీకి నామమాత్రపు ఫీజు చెల్లించి ఉపయోగించుకుంటున్నారు. చిన్నారులు, యువతకు ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఇతర క్రీడల కోచింగ్‌ క్యాంప్‌లు, అకాడమీల నిర్వహణా ఇక్కడే. ఇక అన్ని వర్గాల ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ గ్రౌండ్‌లోనే వాకింగ్‌ చేస్తుంటారు. భద్రాచలం ఏజెన్సీలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులకు కొదవ లేదు. ఆర్చరీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ వంటి క్రీడల్లో గిరిజనులు అద్భుత ప్రతిభ చూపుతారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఇంతటి క్రీడానైపుణ్యం ఉన్నా.. సరైన శిక్షణ లేక పలువురు గ్రామాలకే పరిమితమవుతున్నారు. వీరందరికీ కోచింగ్‌ అకాడమీ నిర్వహణ, శిక్షణ కోసం స్టేడియం నిర్మించాలనే డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement