మొక్కల పెంపకంలో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకంలో నాణ్యత పాటించాలి

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

మొక్కల పెంపకంలో నాణ్యత పాటించాలి

మొక్కల పెంపకంలో నాణ్యత పాటించాలి

అశ్వారావుపేట: అటవీ అభివృద్ధి సంస్థ పరిధి నర్సరీల్లో మొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని టీజీఎఫ్‌డీసీ జీఎం జి.స్కైలాబ్‌ సిబ్బందికి సూచించారు. జిల్లాలోని పలు ప్లాంటేషన్లు, నర్సరీలను మంగళవారం ఆయన పరిశీలించారు. అశ్వారావుపేట నర్సరీలో పలు దశల్లో పెరుగుతున్న మొక్కల నాణ్యతను తనిఖీ చేశారు. మొక్కలను పెంచే విధానం, బెడ్‌ల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో జనరేటర్‌, మౌలిక వసతుల సమస్యలు ఉండేవని, వాటిని పరిష్కరించామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. ఆయన వెంట సత్తుపల్లి డీఎం జి.చంద్రమోహన్‌, అశ్వారావుపేట ప్లాంటేషన్‌ మేనేజర్‌ చంద్రకళ, డీపీఎం తిరుమలరావు తదితరులు ఉన్నారు.

టీజీ ఎఫ్‌డీసీ జీఎం స్కైలాబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement