అంబులెన్స్‌ల పనితీరు పరిశీలన
చుంచుపల్లి: జిల్లాలో నడుసుతన్న 108 అంబులెన్స్‌లను డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ శనివారం తనిఖీ చేశారు. వాహనాల బయటి, లోపలిస్థితి, టైర్లు (స్టెప్నీ సహా), హెడ్ లైట్లు, ఇండికేటర్లు, సైరన్, పీఏ సిస్టమ్ పనితీరు, జీపీఎస్ వ్యవస్థ, ఇంధన స్థాయి, లాగ్‌బుక్ నిర్వహణను పరిశీలించారు. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ల చెల్లుబాటు స్థితిని ధ్రువీకరించారు. ఆక్సిజన్ సిలిండర్ ప్రెషర్ స్థాయి, బీవీఎం (వయోజనులు, పిల్లల కోసం), సెక్షన్ యంత్రం, బీపీ యంత్రం, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సీమీటర్, స్ట్రెచర్, స్పైన్ బోర్డ్, సర్వైకల్ కాలర్లు, డెలివరీ కిట్, ఇతర అత్యవసర పరికరాలను తనిఖీ చేశారు.


