యూరియా అధిక ధరకు విక్రయించొద్దు
టేకులపల్లి: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని బేతంపూడి సొసైటీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం రైతులు, విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో 27,273 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 16,161 మెట్రిక్ టన్నులు వచ్చిందని, ప్రస్తుతం 7,186 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని విరించారు. ఇవి జనవరి వరకు సరిపోతాయని అన్నారు. జిల్లాలో 406 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నామని, టేకులపల్లిలో కౌంటర్లు పెంచుతామని తెలిపారు. ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా ఇస్తామన్నారు. ఏడీఏ జి లాల్‌చంద్, ఏవో నీరుడు అన్నపూర్ణ, మానిటరింగ్ ఆఫీసర్ ఆనంద్, సీఈవో ప్రేమాచారి, ఏఈవోలు శ్రావణి, విశాల, రమేష్ , సోసైటీ సిబ్బంది వెంకటేశ్వర్లు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
వేల్పుల బాబూరావు


