బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అందరూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్, వైద్య, ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరులలో ఐదు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న బాల కార్మికులను, వదిలేసిన పిల్లలను, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించాలని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించాలని, లేదా చైల్డ్ కేర్‌హోమ్‌కు పంపించాలని అన్నారు. బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తొలుత పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్‌స్పెపెక్టర్ రాము, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడబ్లూసీ సభ్యులు అంబేద్కర్, సాధిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, డీసీపీఓ హరికుమారి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్, మాధవరావు, కేఎస్‌సీఎఫ్ కో–ఆర్డినేటర్ రాజేష్, కమిటీ సభ్యులు షీ టీం ఎస్‌ఐ రమాదేవి, ఎస్‌ఐలు విజయ, రాజేష్, సమ్మిరెడ్డి, రాఘవయ్య, లక్ష్మణ్, ఆపరేషన్ స్మైల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజ్


