పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదాం పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించరాదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టెట్ కేంద్రాల వద్ద
అమలులో ఆంక్షలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం నుంచి టెట్ మొదలవుతున్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7–30నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని, సభలు, ర్యాలీలు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. అలాగే, పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. కాగా, పరీక్ష సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
కొబ్బరి సాగుదారులకు రాయితీ పెంపు
అభివృద్ధి బోర్డు డీడీ
డాక్టర్ మంజునాథ్ రెడ్డి
అశ్వారావుపేటరూరల్: కొబ్బరి సాగుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రాయితీలు పెంచిందని, ఈ రాయితీలు పొందాలంటే తోటలకు జియో ట్యాగ్ తప్పనిసరి చేసిందని సీడీబీ(కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేటలోని రైతు కాసాని పద్మ శేఖర్ గార్డెన్‌లో సాగుదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి సాగు ఆశించిన స్థాయిలో లేదని, సాగుదారులు పెరిగితేనే స్థానికంగా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ రఘుతన్, డీవో శరత్, హెచ్‌ఈవో ఈశ్వర్, రైతులు తలశిల ప్రసాద్, కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మా రాంబాబు, తుంబూరు మహేశ్వరరావు, ఆళ్ల నాగేశ్వరరావు, పీ ఆదినారాయణ, శీమకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


