లోకమంతా మననం
●క్రీస్తు జననం..
నేడు క్రిస్‌మస్ పర్వదినం
● ఉమ్మడి జిల్లాలో వందేళ్లు దాటిన ప్రార్థనామందిరాలెన్నో.. ● సుందరంగా ముస్తాబైన చర్చిలు
ఏసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రిస్‌మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలుకాగా, కేక్ కట్ చేసిన మతపెద్దలు ఏసు జనన వృత్తాంతాన్ని వివరించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని పలు చర్చిలు వందేళ్ల క్రితం నిర్మాణమయ్యాయి. జిల్లా మీదుగా రైల్వేలైన్ వెళ్లడం, సింగరేణి గనులు ఉండడంతో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన బ్రిటీషర్ల కాలంలో వీటిని నిర్మించగా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇందులో కొన్ని చర్చిల ప్రత్యేకతలతో కథనం.


