●ఆర్‌సీఎం.. ఆధ్యాత్మిక శోభ
పాల్వంచ: రాష్ట్రంలో మరెక్కడా లేనట్టుగా పాల్వంచలోని ఆర్‌సీఎం చర్చి నిర్మాణ శైలి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ చర్చిని గోర్తిక్ ఆర్ట్స్ విధానంలో నిర్మించారు. ఏడు ఎకరాల ప్రాంగణంలో 13 ఏళ్ల పాటు నిర్మాణం సాగగా, కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్కిటెక్ట్ ఆగస్టీన్ దీనికి రూపకల్పన చేశారు. అలాగే, అప్పటి ఫాదర్ బెనడిక్ట్ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. 1975 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ చర్చి ఆవరణలో దేవదూతల విగ్రహాలు, మరియమ్మ, బాలయేసు ప్రతిమలు ఆకట్టుకుంటాయి. ఏటా క్రిస్‌మస్ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు.


