ఆహ్లాదభరితం.. ఆధ్యాత్మిక కేంద్రం
‘మీ డబ్బు–మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోండి
పాల్వంచ: పాల్వంచ శ్రీనివాసనగర్‌లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం(శ్రీనివాసగిరి) ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక కేంద్రమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. యేరు ఉత్సవంలో భాగంగా బుధవారం ఆయన గుట్టపై ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు తోలేటి నగేష్‌శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్నాక తీర్థప్రసాదాలు స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి పర్యాటక ప్రాంతం అందుబాటులో ఉందని, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దర్శించుకుని ఉల్లాసంగా గడిపే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఎం.పరంధామ రెడ్డి, తహసీల్దార్లు దుర్గాప్రసాద్, భగవాన్‌రెడ్డి, ఆలయ బాధ్యులు కొత్త వెంకటేశ్వర్లు, ఆరుట్ల లక్ష్మణ్, టీఎన్‌జీఓ నాయకులు చైతన్య భార్గవ్, అథ్లెటిక్ సెక్రటరీ మహిధర్, కోచ్‌లు నాగేంద్ర, కల్యాణ్, నబీ, రమేష్, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, పీడీ శ్వేత పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి..
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. నవభారత్ పబ్లిక్ స్కూల్‌లో బుధవారం జరిగిన క్రీడా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. జ్ఞానంతోనే జీవితంలో రాణించగలుగుతామని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఆదర్శనీయమైనదని చెప్పారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకోగా, క్రీడా పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.వి.కె.ప్రసాద్, జాతీయ వాలీబాల్ రిఫరీ సీహెచ్.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాసగిరి గుట్టపై కలెక్టర్ ట్రెక్కింగ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వివిధ కారణాలతో ఏళ్లుగా క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిన ఆర్థిక పరమైన ఆస్తులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో బుధవారం వివిధ బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పటివరకు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా పాలసీల రాబడులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద నిలిచిపోయిన మొత్తాలను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ నిర్వహిస్తున్న ఉద్గమ్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో సుమారు రూ.46 కోట్ల అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన డిపాజిట్లను ఈనెల 31లోపు క్లియర్ చేయాలని ఆదేశించారు. లేదంటే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ విద్యాచందన, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ శ్రీనివాస్, ఎస్‌బీఐ ఆర్‌ఎం సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం సుజిత్ కుమార్, యూనియన్ బ్యాంక్ డీజీఎం హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


