నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
70 రోజులు.. రూ.1.61 కోట్లు
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీలు లెక్కించగా 70 రోజులకు గాను రూ.1,61,02,694 ఆదాయం లభించిందని ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఇంకా మిశ్రమ బంగారం 141 గ్రామలు, మిశ్రమ వెండి 850 గ్రాములు, అమెరికా డాలర్లు 347, సింగపూర్ డాలర్లు 31, కెనడా డాలర్లు 30, నేపాల్ రూపాయలు 25, సౌత్ కొరియా వాన్స్ 11,000తో పాటు వివిధ దేశాల కరెన్సీ వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అడవుల సంరక్షణకు
కృషి చేయండి
జూలూరుపాడు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి జి.కిష్టాగౌడ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన జూలూరుపాడు రేంజ్ పరిధిలో గల రాజారావుపేటలో ప్లాంటేషన్, సహజ అడవులు, వినోభానగర్ బీట్‌లోని రెండు ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అడవులు ఆక్రమణలకు గురి కాకుండా నిఘా ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్‌డీఓ యు.కోటేశ్వరరావు, జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ జి. ప్రసాద్‌రావు, ఎఫ్‌ఎస్‌ఓ వి.మల్లయ్య, ఎఫ్‌బీఓలు ఎ.రేఖ, రహీం, సీహెచ్ వెంకటేశ్వర్లు, శరవణ్, కిషన్, శరణ్ పాల్గొన్నారు.
ముగిసిన రైఫిల్
షూటింగ్ పోటీలు
కొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న రైఫిల్ షూటింగ్ ఫోటీలు బుధవారం ముగిశాయి. పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300 మందికి పైగా హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి, డీఈఓ నాగలక్ష్మి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వి.నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 పిస్టల్ షూటింగ్ విభాగంలో బాలబాలికల నుంచి ముగ్గురు చొప్పున. పీప్ సైట్ విభాగంలో ఇద్దరు చొప్పున, ఓపెన్ సైట్ విభాగంలో ఇద్దరి చొప్పున విజేతలుగా ఎంపిక చేశారు. అండర్ –17 పిస్టల్ విభాగంలో బాలబాలికల్లో ఇద్దరి చొప్పున, పీప్‌సైట్, ఓపెన్ సైట్, అండర్ –19 పిస్టల్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందించారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


