మాదక ద్రవ్యాలు నిర్మూలించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో మాదక ద్రవ్యా ల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో సమాజంపై దుష్ప్రభావం పడుతుందని అన్నారు. దీనిపై పోలీస్ శాఖ నిర్వహిస్తున్న చైతన్యం కార్యక్రమంతో యువతలో అవగాహన పెరుగుతోందని చెప్పారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లకండా శని, ఆదివారాల్లో క్రీడా కార్యక్రమాలు, జుంబా డా న్స్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్టలో ప్రత్యేక ట్రెక్కింగ్ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అట వీ ప్రాంతాల్లో గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ వినియోగంపై కలిగే అనర్థాల గురించి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు.
చిన్ననీటి వనరుల గణన నిర్వహించండి..
జిల్లాలో చిన్ననీటి వనరుల గణనును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2000 హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణనను మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేపట్టాలని సూచించారు. ముందుగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నమూనా గణన పూర్తిచేశాక మిగతా గ్రామాల్లో కొనసాగించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో జీపీఓలు, ఏఈఓలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్యూమరేటర్లుగా పనిచేస్తారని, మండల స్థాయిలో విద్యుత్ ఏఈ, ఇరిగేషన్, పంచాయతీ, ఈజీఎస్, వ్యవసాయ శాఖ సిబ్బందితోపాటు ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారని తెలి పారు. చెరువులు, కుంటలు, వాగులు, లిఫ్ట్ ఇరిగేషన్ నీటి నిల్వ ప్రాంతాల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, భూగర్భ జలాల అభివృద్ధి అధికారి రమేష్, ఇరిగేషన్ ఈఈ అర్జున్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నవజాత శిశువులకు కంటి పరీక్షలు..
చుంచుపల్లి: నవజాత శిశువులకు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీలో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పిల్లలందరికీ 100 శాతం స్క్రీనింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శిశువులో కనిపించే ప్రమాదకర లక్షణాలను త్వరగా గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రవిబాబు, డాక్టర్లు ప్రసాద్, సైదులు,సుభద్ర జలాలి, మధువరణ్, పుల్లారెడ్డి, తేజశ్రీ, స్వప్న, తేజు ప్రతాప్, రోహిత్ పాల్గొన్నారు.


