
జిల్లాలో అధిక వర్షపాతం
సోమవారం జిల్లా సరాసరి 79.8 మి.మీ.గా నమోదు
అత్యధికంగా కొత్తగూడెంలో 192.4 మి.మీ.
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో వర్షపాతం నమోదు సాధారణ స్థాయి నుంచి అధికానికి చేరింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా గణాంకాలు మారిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 1,834.6 మి.మీ. వర్షం కురవగా జిల్లా సరాసరి 79.8 మి.మీ.గా నమోదైంది. కొత్తగూడెంలో అత్యధికంగా 192.4 మి.మీ. వర్షం కురవడం విశేషం. ఇక కరకగూడెం మండలంలో 59.8 మి.మీ, పినపాకలో 36.4, చర్లలో 96.2, దుమ్ముగూడెంలో 20.2, అశ్వాపురంలో 46.2, మణుగూరులో 33.2, ఆళ్లపల్లిలో 17, గుండాలలో 22.2, ఇల్లెందులో 150.6, టేకులపల్లిలో 69.2, జూలూరుపాడులో 69.6, చండ్రుగొండలో 70, అన్నపురెడ్డిపల్లిలో 105.8, చుంచుపల్లిలో 176.6, సుజాతనగర్‌లో 82.2, లక్ష్మీదేవిపల్లిలో 133.6, పాల్వంచలో 119.6, బూర్గంపాడులో 18.6, ములకలపల్లిలో 88.2, దమ్మపేటలో 107.6, అశ్వారావుపేట మండలంలో 114.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాచలంలో అత్యల్పంగా 4.8 మి.మీ.వర్షం పడింది.
ఈ మండలాల్లో అధికం..
ఇప్పటి వరకు జిల్లాలో 14 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వాటిలో అశ్వాపురం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలు ఉండగా, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్మగూడెం, ఆళ్లపల్లి, గుండాల, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 23.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.