
ఈఅండ్‌ఎం డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
సింగరేణి(కొత్తగూడెం)/ఇల్లెందు: సింగరేణి సంస్థ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్(ఈఅండ్‌ఎం) డైరెక్టర్‌గా మోకాళ్ల తిరుమలరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం హైదరాబాద్‌లో సీఎండీ ఎన్.బలరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో ఈ అండ్‌ఎం శాఖ కీలకమైనందున సోలార్, థర్మల్ ప్రాజెక్ట్ విస్తరణలో ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. కాగా, డైరెక్టర్ తిరుమలరావుకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లెందు మండలం కట్టుగూడెంకు చెందిన తిరుమలరావు సింగరేణిలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తూ డైరెక్టర్‌గా ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. 139 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి ఆదివాసీ అధికారికి డైరెక్టర్ పదవి లభించిందని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంట కాంట్రాక్టర్ రాము తదితరులు ఉన్నారు.