తపాలా సేవల్లో మార్పులు.. | - | Sakshi
Sakshi News home page

తపాలా సేవల్లో మార్పులు..

Sep 1 2025 3:17 AM | Updated on Sep 1 2025 3:17 AM

తపాలా

తపాలా సేవల్లో మార్పులు..

● పాత సేవలను రద్దు చేస్తూ అధునాతన విధానాలు అమలు ● నేటి నుంచి రిజిస్టర్‌ పోస్టు సేవలు స్పీడ్‌ పోస్టులో విలీనం ● పోస్టుబాక్స్‌ల ఎత్తివేతపై ప్రచారం

మార్గదర్శకాలను పాటిస్తాం

● పాత సేవలను రద్దు చేస్తూ అధునాతన విధానాలు అమలు ● నేటి నుంచి రిజిస్టర్‌ పోస్టు సేవలు స్పీడ్‌ పోస్టులో విలీనం ● పోస్టుబాక్స్‌ల ఎత్తివేతపై ప్రచారం

ఖమ్మంగాంధీచౌక్‌: తపాలా సేవల్లో పెను మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతిక విధానాలతో తపాలా శాఖ దూసుకుపోతోంది. అధునాత సాంకేతిక విధానాలను అవలంభిస్తూ ఈ– సేవలను విస్తరిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ అనేక మార్పులను తీసుకువస్తోంది. సేవలను వేగవంతంగా, ప్రైవేట్‌ సంస్థలకు పోటీగా నిర్వహించటం కోసం అధునాతన సాంకేతిక విధానాల అమలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతేగాక పూర్వ కాలం నాటి ఉత్తరాల బట్వాడ, మనియార్డర్‌ వంటి సేవలే గాక ప్రజల సౌకర్యార్థం అనేక రకాల సేవలు, ప్రభుత్వ పథకాలను తపాలా శాఖ అందిస్తోంది. అందులో భాగంగా పాత విధానాలను కొద్దిగా రద్దు చేస్తూ మరికొన్నింటిలో మా ర్పులు తీసుకొస్తూ.. నూతన విధానాలను అమలు చేస్తోంది. మొబైళ్లు, ఇంటర్నెట్‌ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలా శాఖ. అయితే పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా తపాలాశాఖ అప్‌గ్రేడ్‌ అవుతోంది. తాజాగా రిజిస్టర్‌ పోస్టు సేవా విధానాన్ని మార్చింది. పోస్టు బాక్సుల ఎత్తివేత అంశం తెరపైకి వచ్చింది.

ఇక స్పీడ్‌ పోస్టులే..

రిజిస్టర్‌ పోస్టు సేవలకు తపాలా శాఖ మంగళం పాడుతోంది. సెప్టెంబర్‌ 1 (సోమవారం) నుంచి ఈ సేవలను నిలిపి వేస్తున్నట్లు తపాలా శాఖ ఇప్పటికే ప్రకటించగా.. పోస్టల్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రిజిస్టర్‌ పోస్టు సేవలను పూర్తిగా స్పీడ్‌ పోస్టు సేవలో విలీనం చేశారు. దేశీయ పోస్టల్‌ సేవల క్రమబద్ధీకరణ, పనితీరును మెరుగుపర్చ టం, ట్రాకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయటం వంటి ప్రక్రియలో భాగంగా స్పీడ్‌ పోస్టులో రిజిస్టర్‌ పోస్టును విలీనం చేస్తునట్లు సంస్థ ప్రకటించింది. స్పీడ్‌ పోస్ట్‌ అంటే వేగవంతమైన డెలివరీ. స్పీడ్‌ పోస్టు ద్వారా పార్శిల్‌ ఎక్కడి వరకు చేరిందనే విషయాన్ని ఆన్‌లైన్‌లో గుర్తించవచ్చు. ఇది రిజిస్టర్‌ పోస్టు సేవల్లో లేదు. కాగా, రిజిస్టర్‌ పోస్టుల వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సప్‌, జీ–మెయిల్‌ వంటి డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రావటంతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం డిజిటల్‌ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. అంతేగాక కొరియర్‌ వ్యవస్థ పెరిగింది. ఈ ప్రభావం కూడా రిజిస్టర్‌ వ్యవస్థపై పడింది. గతంతో పోలిస్తే రిజిస్టర్‌ పోస్టు సేవల వ్యవస్థ ఏకంగా 25 శాతం పడిపోయిందని తపాలా ఉద్యోగులు చెబుతున్నారు.

పోస్టు బాక్సులు కనిపించవా..?

వందల ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్సుల ఎత్తివేతపై ప్రచారం సాగుతోంది. సోషల్‌ మీడియాల్లో ఈ అంశం చక్కర్లు కొడుతోంది. దశాబ్దాలుగా నిస్వార్థంగా, నిశ్శబ్దంగా, నిశ్చలంగా, విశ్వసనీయంగా సేవలందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదన్న బాధ పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై తమకు సమాచారం లేదని, పోస్టు బాక్సుల ఎత్తివేత అవాస్తవమని అధికారులు కొట్టిపారేస్తున్నారు.

రిజిస్టర్‌ పోస్టు సేవలను స్పీడ్‌ పోస్టులో విలీనం చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారు. తపాలాశాఖ మార్గదర్శకాలను అనుసరించి సేవ లను అందిస్తాం. అధునాతన సాంకేతిక విధానాలతో సేవలను వేగవంతం చేయటం కోసం తపా లా సేవల్లో పలు మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. పోస్టు బాక్సుల ఎత్తివేత ఊహాగానమే. ఎలాంటి ఆదేశాలు లేవు. –వి.వీరభద్రస్వామి,

పోస్టల్‌ సూపరింటెండెంట్‌, ఖమ్మం డివిజన్‌

తపాలా సేవల్లో మార్పులు.. 1
1/2

తపాలా సేవల్లో మార్పులు..

తపాలా సేవల్లో మార్పులు.. 2
2/2

తపాలా సేవల్లో మార్పులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement