
అథ్లెటిక్స్‌లో జిల్లాకు 38 పతకాలు
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, పాలమూరు యూనివర్సిటీ స్టేడియంలో శనివారం ముగిసిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు 38 పతకాలు వచ్చాయి. ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ వివరాలు వెల్లడించారు. జిల్లా నుంచి 30 మంది పలు కేటగిరిల్లో పాల్గొని 38 పతకాలు (బంగారు పతకాలు–11, రజత పతకాలు–17, కాంస్య పతకాలు–10) సాధించారన్నారు. పినపాకకు చెందిన తోలేం శ్రీతేజా 200 మీటర్ల పరుగుపందెం, హైజంప్‌లో రెండు బంగారు పతకాలు, భద్రాచలానికి చెందిన ఎం.శ్రీవిద్యదొర 80 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం, కొత్తగూడెంనకు చెందిన జరుపుల దీక్షిత్ 60 మీటర్లు పరుగుపందెంలో బంగారు పతకం కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పరంధామరెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.సారంగపాణి, నాగపూరి రమేశ్, గొట్టపు రాధాకృష్ణ, జె.నాగేందర్, గిరిప్రసాద్, డి.మల్లికార్జున్, నాగరాజు, ప్రసాద్ అభినందించారు.