
ముంపు ప్రాంతాల నుంచి గర్భిణుల తరలింపు
భద్రాచలంఅర్బన్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు 81 మంది గర్భిణులను తరలించారు. వారిలో 35 మంది గర్భిణులకు డెలి వరీ చేశారు. ప్రసవం అయిన వారు డిశ్చార్జ్ కాగా, కొందరు లేబర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మండలం నుంచి వచ్చిన గర్భిణులు ప్రసవించిన తరువాత కూడా ఏరియా ఆస్పత్రిలోనే ఉండాలని, ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఉన్న క్రమంలో ఆ ప్రాంతవాసులను డిశ్చా ర్జ్ చేయొద్దని శనివారం అడిషనల్ డీఎంహెచ్‌ఓ సైదులు, భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైత న్య.. లేబర్ వార్డు సిబ్బందిని ఆదేశించారు. కాగా, తమను డిశ్చార్జ్ చేయాలని, వరద ఉన్నా నుడుచుకుంటూ వెళ్తామని చింతూరు ప్రాంత బాలింతలు చెబుతున్నారు. కాగా, ఎవరైనా ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతారేమననే అయోమయ స్థితిలో ప్రస్తుతం లేబర్ వార్డు సిబ్బంది ఉన్నారు.