
మొదలైన కేటీపీఎస్ సొసైటీ నామినేషన్లు
పాల్వంచ: కేటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. స్థానిక కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రాంగణంలోని కోఆపరేటివ్ సొసై టీ కార్యాలయం వద్ద పోటాపోటీగా పలువురు ఉద్యోగులు డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు వేశారు. మొత్తం 3,003 ఓట్లకు గాను కేటీపీఎస్‌లో 2,106, బీటీపీఎస్‌లో 501, వైటీపీఎస్ లో 396 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల అధికారి జి. గంగాధర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎ. శ్రీని వాస్ ఆధ్వర్యంలో మొత్తం 13 డైరెక్టర్ పోస్టు లకు తొలిరోజు 23మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. గత పాలకవర్గంలో ఉన్న డైరెక్టర్లు దానం నర్సింహారావు, మహేందర్, కేశులాల్‌నాయక్, ధర్మరాజుల నాగేశ్వరరావు సైతం మరోసారి నామినేషన్లు దాఖలు చేశారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 1535, టీఆర్‌వీకేఎస్‌కు చెందిన అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, బండి నాగరాజు, అల్లాడి పుల్లారావు, నారందాసు వెంకటేశ్వర్లు, రాసూరి శ్రీనివాస్, తోట అనిల్‌కుమార్ నామినేషన్లు వేశారు.
రిటైర్డ్ పోలీసులకు సన్మానం
కొత్తగూడెంటౌన్: పలు పోలీస్ స్టేషన్లలో విధు లు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు పోలీసులను ఎస్పీ రోహిత్‌రాజు శనివా రం తన చాంబర్‌లో సన్మానించారు. సన్మానం పొందినవారిలో రామవరం టూటౌన్, అశ్వాపురం, లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐలు ఖాజా మక్బూద్‌అలీఖాన్, కొత్తా నాగేశ్వరరావు, మందపల్లి ప్రసాద్, జూలురుపాడు, ఇల్లెందు ఏఎస్‌ఐలు కుక్కమళ్ల కోటేశ్వరరావు, చిన్న ధన్‌పాల్, ము లకలపల్లి హెడ్ కానిస్టేబుల్ కన్నిడి వెంకటేశ్వ ర్లు ఉన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఏఓ మంజ్యానాయక్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి, ఎంటీఓ సుధాకర్, అడ్మిన్ ఆర్‌ఐ లాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి మహిళా
కళాశాలలో వర్క్‌షాప్
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘మోటివేషనల్ ఇన్నోవేషన్ సపోర్ట్ ట్రైనింగ్ ఫర్ యంగ్ ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్’అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొ ఫెసర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కమతం శ్రీనివాస్, నేలకొండపల్లి ప్రభు త్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రమేశ్ హాజరై ప్రసంగించారు. వ్యాపారంలోని అడ్డంకులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ సీఎస్ వెంకటాచారి, కరస్పాండెంట్ జీకే కిరణ్‌కుమార్, కళాశాల ప్రిన్సి పాల్ శారద మాట్లాడారు. కార్యక్రమంలో కామర్స్ హెచ్‌ఓడీ రజని, అధ్యాపకులు మాణిక్యాంబ, కృష్ణవేణి, శైలజ పాల్గొన్నారు.
పత్తిపంట ధ్వంసం
పాల్వంచరూరల్: మండలంలోని మందెరకలపాడు పంచాయతీ ఒంటిగుడిశ గ్రామానికి చెందిన గిరిజన రైతులు లక్ష్మయ్య, పాండు, నారాయణ, సింగు చాంతకొండ రేంజ్ పరిధిలోని బంగారుచెలక పత్తి సాగుచేశారు. ఈ పంటను శనివారం వైల్డ్‌లైఫ్ సిబ్బంది ధ్వంసం చేశారని బాధిత రైతులు తెలిపారు.
స్కూల్ బస్సును
ఢీకొట్టిన లారీ
టేకులపల్లి: ఆగి ఉన్న స్కూల్ బస్సును వెనుక నుంచి బొగ్గు లారీ ఢీకొట్టిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. రామవరంలోని బిల్డింగ్ బ్లాక్స్ హైస్కూల్‌కు చెందిన బస్సు పాఠశాలకు వస్తున్న క్రమంలో శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ వద్ద విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో టేకులపల్లి నుంచి వేగంగా వచ్చిన బొగ్గు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సులోని ఓ చిన్నారికి స్వల్పంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
నలుగురు
జీఎంల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు జీఎంలను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్‌ఓడీ మురళీధర్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం రీజియన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ జీఎం దేబులాల్ బైద్యను నైనీ ఏరియా జీఎంగా, నైనీ ఏరియా జీఎం సంజయ్ మనోజ్ ముదార్‌ను రామగుండం రీజియన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ జీఎంగా, కార్పొరేట్ ఎస్టేట్స్ జీఎం రాధాకృష్ణను మందమర్రి ఏరియా జీఎంగా, మణుగురు ఏరియా పీకేఓసీ ఏజీఎం టి. లక్ష్మీపతిగౌడ్‌ను కార్పొరేట్ ఎస్టేట్స్ హెచ్‌ఓడీగా బదిలీచేశారు.