
ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు విక్రయిస్తే చర్యలు
కొత్తగూడెంఅర్బన్: అర్హత కలిగిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భస్రావ మాత్రలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి హెచ్చరించారు. కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో లింగ నిష్పత్తి తగ్గుతున్న నేపథ్యాన అక్రమ గర్భస్రావాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. ఈమేరకు అనధికార అమ్మకాల కట్టడికి సహకరించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, అదనపు డీఎంహెచ్‌ఓ సైదులు, వైద్యులు మధువరన్, తేజశ్రీ, ఫయీజ్ మొహినుద్దీన్ పాల్గొన్నారు.