
108 రకాల పిండివంటలతో నైవేద్యాలు
మణుగూరు అశోక్‌నగర్ వాసవీనగర్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి శుక్రవారం భక్తులు 108 రకాల పిండివంటలతో నైవేద్యాలు సమర్పించారు.
ఉదయం మహిళలు సామూహిక కుంకుమ పూజ చేశారు. ఆతర్వాత ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు, లడ్డూలు తదితర 108 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. – మణుగూరు టౌన్