
● తప్పని యూరియా పాట్లు
‘వ్యవసాయ పనులు పక్కన పెట్టి యూరియా కోసం రోజూ వస్తున్నాం.. ఒక బస్తా ఇచ్చేందుకు మూడు రోజులుగా గోసపెడుతున్నారు’ అంటూ రైతులు యూరియా విక్రయాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నిజాంపేట విక్రయ కేంద్రానికి మూడు రోజులుగా యూరియా సరఫరా నిలిచిపోయింది. మంగళవారం కూడా విక్రయించడం లేదని తెలిసి.. చెప్పులు క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు వారికి నచ్చజెప్పి.. బుధవారం తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారమే టోకెన్లు పంపిణీ చేయగా వాటి కోసం తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ యూరియా విక్రయ కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అన్నదాతల అవసరాలను గుర్తించి సకాలంలో యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
–ఇల్లెందురూరల్
తెల్లవారకముందే
చెప్పులతో క్యూలైన్