
పెన్షన్ విద్రోహ దినం పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో పెన్షన్ విద్రోహదినం జరుపుతున్నట్లు టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ రామారావు, సెక్రటరీ జనరల్ సంగం వెంకటపుల్లయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెన్షన్ విద్రోహదినం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పాల్వంచ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులతో మాహా బైక్‌ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జేఏ సీ భాగస్వామ్య పక్షాలైన సంఘాలు,డ్రైవర్ల సంఘం, సీపీఎస్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.