కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో మూడో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వనం వినయ్‌కుమార్ శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, వినయ్‌కుమార్‌ను జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు సన్మానించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామిశెట్టి రమేశ్, డీకొండ రవికుమార్‌తో పాటు లగడపాటి సురేశ్, నిమ్మల మల్లికార్జున్, ఈ.మీనాకుమారి, జి.ప్రమీల, హెచ్.సత్యనారాయణ పాల్గొన్నారు. అలా గే, భద్రాచలం అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గాభవాని కూడా జిల్లా జడ్జి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నిరుద్యోగ యువతకు ‘నవ లిమిటెడ్’ చేయూత
పాల్వంచ: నిరుద్యోగ యువతకు నవ లిమిటెడ్ సంస్థ చేయూతగా నిలుస్తోందని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కె.సంజీవరావు తెలిపారు. పాల్వంచలోని నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం ఆయన సర్టిఫికెట్లు అంజేసి మాట్లాడా రు. యువత ఉపాధి అవకాశాలు అందిపుచ్చు కునేలా వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించా లని సూచించారు. నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (సీఎస్‌ఆర్) ఎంజీఎం ప్రసాద్ మా ట్లాడు తూ.. ఇప్పటివరకు 1,711 మందికి పైగా శిక్షణ ఇవ్వగా, పలువురు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో జన రల్ మేనేజర్ ఎన్.సురేశ్‌చంద్ర, లైజన్ ఆఫీసర్ ఖాదరేంద్ర బాబు, మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు, యూ ఎస్‌ఎన్.శర్మ, బిన్ను, సాయి, శ్రావణ్, శ్యాం, అలీ తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం, పరిశుభ్రత ఆధారంగా రేటింగ్
కొత్తగూడెంఅర్బన్: పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. కొత్తగూడెంలో ఉపాధ్యాయులకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. రేటింగ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అందుకోసం ప్రతి పాఠశాల నుంచి పూర్తి వివరాల తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎస్‌కే సైదులు మాట్లాడుతూ.. 2021లో ఇదే కార్యక్రమం ద్వారా జిల్లా పాఠశాలలు జాతీయస్థాయికి ఎంపికయ్యా యని గుర్తు చేశారు. అదేస్ఫూర్తితో ఈసారి కూడా అవార్డులు పొందేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయా లని పేర్కొన్నారు. శిక్షణలో జిల్లా రిసోర్స్ పర్స న్లు స్వరూప్‌కుమార్, కోటేశ్వరరావు ఆన్‌లైన్ నమోదు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్‌కే సైదులు, ఎ.నాగరాజు శేఖర్, ఎన్.సతీశ్‌కుమార్, మండల రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు.
సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసర్వే
జూలూరుపాడు: మండలంలో సీతారామ ప్రా జెక్టు ప్రధాన కాల్వ నిర్మాణం కోసం శుక్రవారం భూసర్వే నిర్వహించారు. కెనాల్ నిర్మాణం 104 కి.మీ. మేర పూర్తి కాగా, మిగిలిన కాల్వ నిర్మా ణం కోసం భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ విషయంలో స్పష్టత లేక పాపకొల్లు, రాజారా వుపేట, భోజ్యాతండా రైతులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యాన కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు పాల్వంచ ఎస్‌డీసీ కార్తీక్ పర్యవేక్షణలో జూలూరుపాడు తహసీల్దార్ టి.శ్రీనివాస్ ఆధ్వర్యాన సర్వే చేపట్టారు. సుమారు 2.5కి.మీ. మేర కెనాల్ భూ సేకరణ కోసం సర్వేయర్ ప్రవీణ్ తదితరులు సర్వే నిర్వహించారు. సర్వే పూర్తయితే సీతారామ మెయిన్ కెనాల్ కింద భూములు కోల్పోయిన పాపకొల్లు, రాజారావుపేట, భోజ్యాతండా రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అంద నుంది. ఆర్‌ఐ సీహెచ్.ఆదినారాయణ, సర్వేయర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.