
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
● ధ్యాన్‌చంద్ జీవితం అందరికీ ఆదర్శం ● క్రీడాదినోత్సవంలో కలెక్టర్ పాటిల్
కొత్తగూడెంటౌన్: మేజర్ ధ్యాన్‌చంద్ జీవితం అందరికీ ఆదర్శనీయమని.. ఆయన స్ఫూర్తిగా విద్యా ర్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాన్ని తెలుసుకుని క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం అందించాలని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ చెప్పారు.
విద్యార్థులకు పతకాలు
ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలకు కలెక్టర్ పాటిల్ పతకాలు అందజేశారు. అండర్–9 బాలికల విభాగంలో ఫాతిమా, పి.అతిదిప్రియ, రజిత, డి.భవంతి, అండర్–10లో కె.సహస్ర, ఎల్.నాగజేశ్విత, ఎస్‌కే సైమా, పుండరీకాక్ష, అండర్–11లో జి.మాన్విత, జె.ప్రశాంతి, ఎస్‌కే సైమా వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆయా కార్యక్రమా ల్లో జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి, వివిధక్రీడా అసోసియేషన్ల బాధ్యులు యుగేంధర్‌రెడ్డి, నరేశ్, ఎర్రా కామేశ్, వై.వెంకటేశ్వ ర్లు, సావిత్రి, షమీవుద్దీన్, యాకూబ్, కిరణ్, కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద శనివారం సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు.
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు తెలపండి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి వివిధ పార్టీల ప్రతినిదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 471 జీపీల్లో మొత్తం 6,69,024 ఓటర్లకు గాను పురుషులు 3,25,033, మహిళలు 3,43,967 మంది, ఇతరులు 24 మంది ఉన్నారని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా మండల కార్యాలయాల్లో అందించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితా వెలువరిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, వివిధ పార్టీల నాయకులు లక్ష్మణ్, బాలప్రసాద్, రేగా కాంతా రావు, సలిగంటి శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నరేందర్, నోముల బాలు, ఎ.రాంబాబు పాల్గొన్నారు.
సెర్ప్ కోఆర్డినేటర్ల బదిలీ కౌన్సెలింగ్
డీఆర్‌డీఓ పరిధి 83 క్లస్టర్లలో ఉన్న 93 మంది సెర్ప్ కోఆర్డినేటర్లకు శుక్రవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టర్ పాటిల్, డీఆర్‌డీఓ విద్యాచందన నేతృత్వాన ఈ కౌన్సెలింగ్ జరిగింది. స్పౌజ్ కేటగిరీ, 70 శాతం పైబడిన వైకల్యం, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. అడిషనల్ డీఆర్‌డీఓ బి.నీలయ్య, సూపరింటెండెంట్ కె.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.