
క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్
● పాల్వంచలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● వచ్చేనెల 10న ఓటింగ్, అదేరోజు ఫలితాలు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలకు నోటి ఫికేషన్‌ను ఎన్నికల అధికారి జి.గంగాధర్ శుక్ర వా రం విడుదల చేశారు. శనివారం, సోమ, మంగళవారాల్లో నామినేషన్లను పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఆ తర్వాత 3వ తేదీన నామినేషన్లు పరిశీలించి ఉపసంహరణల అనంతరం తుది జాబితా విడుదల చేయ డంతో పాటు బరిలో మిగిలిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. వచ్చేనెల 10వ తేదీన పాల్వంచలోని డీఏవీ హైస్కూల్, మణుగూరు బీటీపీఎస్‌లోని ఎస్‌పీఎఫ్ భవనం, నల్లగొండ జిల్లా దామరచర్ల వైటీపీఎస్‌లోని స్టోర్స్ ఆఫీస్‌లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను పాల్వంచ డీఏవీ స్కూల్‌కు చేర్చి అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
మొత్తం 3,008 ఓట్లు
గతంలో కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే కోఆపరేటివ్ ఉద్యోగుల సొసైటీ కొనసాగేది. అయితే, పాత ప్లాంట్‌ను మూసివేయడమే కాక కొత్తగా బీటీపీఎస్, వైటీపీఎస్ ప్లాంట్ల నిర్మాణంతో పలువురు ఉద్యోగులు అక్కడకు బదిలీపై వెళ్లారు. దీంతో ఇక్కడి సొసైటీ సభ్యులు ఆయా కర్మాగారాల్లో విధులు నిర్వహిస్తుండగా వారూ ఓటింగ్‌లో పాల్గొనేలా మూడు చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సొసైటీలో మొత్తం 3,008 మంది సభ్యులు ఉండగా, కేటీపీఎస్‌లో 2,100, బీటీపీఎస్‌లో 504, వైటీపీఎస్‌లో 404 మంది ఓటు వేయనున్నారు. కాగా, మొత్తం 13 డైరెక్టర్ పోస్టులకు ఎన్నిక జరుగుతుండగా ఏడు జనరల్, రెండు బీసీ జనరల్‌కు, ఎస్సీ జనరల్, ఉమెన్, ఎస్టీ జనరల్, ఉమెన్‌కు ఒక్కో పోస్టు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 15 మంది బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.