
50 కేజీల గంజాయి స్వాధీనం
పినపాక: మండలంలో భారీ మొత్తంలో గంజా యి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురుని అదుపులోకి తీసుకున్నా రు. సీఐవెంకటేశ్వర్లు శుక్ర వారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. ఒడి శా నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి పల్సర్ బైక్‌పై ఎస్కార్ట్‌గా వస్తుండగా మరో నలుగురు వ్యక్తులు మూడు కార్లలో గంజాయి రవాణా చేస్తున్నారు. పినపాక ఎక్స్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా రూ.25లక్షల విలువైన 50 కేజీల గంజాయి లభించింది. నిందితులు పల్లెపు శ్రీకాంత్, దాసరి వెంకటేశ్వరరావు, మడకం రాజు, కొండూరి వినయ్, తంబళ్ల పుల్లారావును అదుపులోకి తీసుకుని, మూడు కార్లు, ఒక బైక్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
దమ్మపేట: క్రూడ్ పామాయిల్ లోడ్‌తో వెళ్తున్నట్యాంకర్ బోల్తా పడిన ఘటన మండలంలోని కొమ్ముగూడెం శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడుకు 25 టన్నుల క్రూడ్ పామాయిల్ లోడుతో ఒక ట్యాంకర్ బయలుదేరింది. ఈ క్రమంలో ఆ లారీ కొమ్ముగూడెం శివారులో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీడ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ట్యాంకర్ నుంచి ఆయిల్ నష్టం కూడా జరగలేదు.

50 కేజీల గంజాయి స్వాధీనం