
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. అండర్–15 విభాగంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో ఎందరో ఉన్నత స్థాయికి చేరారని, ఈ వారసత్వాన్ని యువత కొనసాగించాలని సూచించారు. బ్యాడ్మింటన్ శిక్షణకు అన్ని వసతులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఎస్పీ జి.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడుతూ జిల్లా నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడగా కార్పొరేటర్ కమర్తపు మురళి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.చంద్రశేఖర్‌తో పాటు ిసిరిపురపు సుదర్శన్, పి.రవిమారుత్, పి.యుగంధర్, దుద్దుకూరి సత్యనారాయణ, జట్ల శ్రీను, కొంగర శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రీ క్వార్టర్‌కు చేరిన టోర్నీ
రాష్ట్రస్థాయి అండర్–15 బ్యాడ్మింటన్ పోటీలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. బాలబాలికల నాకౌట్ పోటీలు శుక్రవారం రాత్రి పూర్తయ్యాయి. శనివారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు.