
‘పెదవాగు’ పునర్నిర్మాణానికి కృషి చేయండి
అశ్వారావుపేటరూరల్: జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్‌ను అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపాన పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు మాజీ మంత్రి జలగం ప్రసాద్‌తో కలిసి హైదరారాబాద్‌లో శుక్రవారం కలిశారు. గతేడాది జూలై 18వ తేదీన కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడ్డా యి. ఆ తర్వాత తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మించినా ప్రాజెక్టు పున:నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆయకట్టు రైతులతోపాటు మాజీ మంత్రి జలగం ప్రసాద్ నేతృత్వాన హుస్సేన్‌నాయన్‌ను కలిసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పున:నిర్మించేలా కృషిచేయాలని కోరా రు. రైతులు పుట్టా సత్యం, చిమడబోయిన శ్రీను, గారపాటి పుల్లారావు, శెట్టిపల్లి కృష్ణారెడ్డి, సాయిల వీరబాబు, డేరంగుల దుర్గయ్య, కొండపాటి శ్రీరామచంద్రమూర్తి, కంగాల కల్లయ్య, చాపర్ల శ్రీనివాసరావు, పద్దం రమేశ్, కొర్రి రామా రావు, కుంజా విజయ్ పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడికి వినతి