
సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలు
భద్రాచలం/భద్రాచలంటౌన్: కుల, మత తామతమ్యం లేకుండా జరుపుకునే పండుగలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కలెక్టర్‌జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం బస్టాండ్ సమీపాన అశోక్‌నగర్ కాలనీలో భద్రాద్రి మహారాజ్ వినాయక భక్తమండలి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాధుడికి బుధవారం వారు పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలుత విగ్రహాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్‌పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ ఆవిష్కరించారు. అలాగే, ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో పీఓ పాల్గొన్నారు. భద్రాద్రి మహారాజ్ కమిటీ సభ్యులు, భక్తులు, ఐటీడీఏ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
గణపతి ఉత్సవాల్లో కలెక్టర్, ఐటీడీఓ పీఓ

సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలు